Real ghost story ROOM NO:313-రూమ్ నెంబర్:313

 Story 8:

               ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బ్రెజిల్ లో ఒక హోటల్ లో జరిగిన యదార్థ సంఘటన.థామస్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో  జరిగిన ఒక సంఘటన. ఇప్పుడు స్టోరీ లోకి వెళ్దాం......


        థామస్  బ్రెజిల్ ఒకరోజు  ఒక హోటల్లో  స్టే  చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్ లో ఉండే రూమ్ నెంబర్ 310  అతనికి ఇచ్చారు. అయితే అతనికి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతన్ని పొరపాటున కూడా  నెంబర్ 313 రూమ్  దగ్గర కూడా వెళ్ళద్దు అని చెప్పింది. అయితే అతను రూమ్ కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అసలు అమ్మాయి ఎందుకు రూమ్  నెం 313 కి    వెళ్ళకూడదని ఎందుకు చెప్పిందా?  అని ఆలోచించాడు.



         అయితే తరువాత అతనికి ఆ రూమ్లో ఏముందో  తెలుసుకోవాలని  ఇంట్రెస్ట్ ఎక్కువైంది.అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ రూమ్ డోర్ కి  ఉన్న 'కీ'  హొల్  నుండి లోపలికి చూసాడు.అయితే అతనికి ఆ  రూమ్ లో ....


         ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి తెల్ల గౌను వేసుకుని గోడకు దగ్గరగా  నిలబడి ఉంది.ఆ అమ్మాయి  శరీరం చాలా తెల్లగా ఉంది జుట్టు విరబోసుకుని అలాగే కదలకుండా  నిలబడి ఉంది. గోడ వైపు తిరిగి నిలబడడం వల్ల థామస్ ఆ  అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. అయితే మధ్యాహ్నం అవడంతో అతను లంచ్ చేయడానికి కిందకి వచ్చాడు .అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి  అతన్ని ఆ రూమ్ దగ్గరకు  వెళ్ళొద్దని మళ్ళీ చెప్పింది. అయితే అతను లంచ్ అయిన తర్వాత తన రూంలోకి వెళ్ళాడు. మళ్లీ రాత్రి డిన్నర్ కి వచ్చినప్పుడు అతను రూమ్ నెంబర్ 313లోకి  మళ్లీ  చూసాడు ఈసారి అతనికి......


            మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న  ఒక ఆకారం కనిపించింది .అయితే అది ఏంటో అర్థం కాలేదు.అతను డిన్నర్ చేయడానికి కిందకు వచ్చాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్లీ అదే మాట చెప్పింది.అయితే ఈసారి అతను ఆ అమ్మాయిని  అసలు రూమ్ లో ఉన్నది ఎవరు? అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్ లో ఎవరు లేరని చెప్పింది .ఆ రూమ్ ను  చాలా రోజుల కిందట మూసేశారని అని చెప్పింది. అతను ఆమెను ఎందుకు ఆ రూమ్ ని  మూసేశారని అని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి అసలు విషయం చెప్పింది.


     ఒక నెల రోజుల క్రితం ఆ రూమ్ ని  ఇద్దరు భార్యాభర్తలు తీసుకున్నారని, అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకుని ఉండగా ఆమెను  అతి కిరాతకంగా హత్య చేశాడని, అప్పటినుండి ఆ అమ్మాయి  అదే రూమ్ లో తెల్ల గౌను వేసుకుని హోటల్లో పని   చేసిన చాలామందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది.అందువలన ఆ   రూమ్  మూసేశారని అని చెప్పింది. అయితే ఆమె  కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో  నిండి  ఉంటాయని ఆమె చెప్పింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది...


       అతను డిన్నర్ కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్ లో కనబడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళు అన్నమాట... అంటే ఇతను ఇటు వైపు నుండి చూసినప్పుడు  ఆ దెయ్యం  అటు నుండి చూసింది.అన్నమాట.. ఇతను చూసిన ఆ ఎర్రని ఆకారం ఆ దెయ్యం యొక్క కళ్ళు అన్నమాట అది తలుచుకుంటే అప్పుడు అతని గుండెల్లో గుబులు మొదలైంది.ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అతను  తర్వాత అతని రూమ్ లో పడుకున్నాడు.. చాలా సేపటి తర్వాత తిరిగి నిద్రపట్టింది. అతను ఆ తరువాత రోజు ఉదయం అతని రూం తలుపు తీయలేదు. అక్కడ పనిచేసే  సిబ్బంది ఆ రూమ్ తలుపులు  బద్ధలుగొట్టారు.  తర్వాత అక్కడ ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు......


      అతను పడుకున్నా  బెడ్ మొత్తం  రక్తంతో నిండి పోయింది .అది నీ కళ్ళ నుండి గుడ్లు బయటకు వచ్చి  అతి దారుణంగా చనిపోయాడు. ఆ సంఘటన తర్వాత ఆ  హోటల్ పూర్తిగా మూసివేయబడింది. కొద్దిరోజుల తర్వాత ఆ హోటల్ కూల్చివేయడం జరిగింది. కానీ ఏ తప్పు చేయని థామస్ భూతానికి బలి కావాల్సి వచ్చింది.......


             మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి .నేను దాని పై స్టోరీ   రాస్తాను.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు