Real zombie story-రక్త పిశాచి

           

Story 9:

             ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ  అలాస్కా లోని లుబీనా అనే గ్రామంలో జరిగిన ఒక యదార్థ సంఘటన .అయితే ఆ గ్రామంలో జాన్సన్  అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు  అతను హఠాత్తుగా మరణించాడు .అప్పుడు అతని కుటుంబ సభ్యులు అతన్ని స్మశానంలో పాతిపెట్టారు.


         అయితే తర్వాత రోజు నుండి ఆ ఊరిలో రోజూఎవరో ఒకరు మరణిస్తూ  ఉండేవారు. కానీ అవి సాధారణ మరణాలు కాదు .చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్లతో కొరికినట్టుగా గాట్లు ఉండి, వాళ్ళ శరీరంలో రక్తాన్ని  తాగినట్లు ఉండేది. చనిపోయిన వారి శరీరంలో పూర్తిగా రక్తం ఉండేది కాదు.


       ఈ సంఘటన చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడ్డారు. రాత్రి అయితే చాలు ఎవరు బయటకు వచ్చే వారు కాదు .కానీ నా మరణాలు కూడా  ఆగేవి కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత  ఆ ఊరిలో కొంతమంది  చనిపోయిన జాన్సన్ ను తాము  చూసినట్లుగా చెప్పుకోవడం. మొదలుపెట్టారు. నెల రోజులు గడిచినా మా ఊరిలో మరణాలు ఇంకా ఆగలేదు.


   అయితే చాలామంది  జాన్సన్ ను చూశామని చెప్పడంతో  జరుగుతున్న  హత్యలకు  జాన్సన్ కు  ఏదో సంబంధం ఉందని ఆ ఊరి  వాళ్ళందరూ నమ్మారు. వెంటనే ఆ ఊరి  వాళ్ళు చర్చి ఫాదర్ తో కలిసి జాన్సన్ యొక్క  శవాన్ని బయటకు  తీశారు. వాళ్ళందరూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశారు


    వారు అందరూ  జాన్సన్ శవాన్ని చూసి చాలా భయపడ్డారు దానికి కారణం నెల రోజులు గడిచినా జాన్సన్ శవం కొంచెం కూడా పాడవ్వలేదు. అలాగే జాన్సన్  జుట్టూ ఇంకా  గోర్లు పాతి పెట్టినప్పుడు కంటే పెరిగినట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించారు.


       అంటే జాన్సన్ ఒక రక్త పిశాచిగా మారాడు. అతనే రాత్రిపూట శవపేటిక నుండి  బయటకొచ్చి ఆ అక్కడ ఉన్న వారిని  చంపి వాళ్ల రక్తాన్ని తాగేవాడు. విషయాన్ని గమనించిన మా ఊరి వారు జాన్సన్  శవాన్ని పూర్తిగా కాల్చేశారు.


    ఆ రోజు నుండి మా ఊరిలో ఎలాంటి అసాధారణమైన మరణం జరగలేదు. ప్రపంచంలోనే మొదటిసారి అందరికీ తెలిసిన ఒక రక్త పిశాచి నిజమైన కదా....

          మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి .నేను దాని పై స్టోరీ   రాస్తాను

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు