Bloody mary-బ్లడీ మేరీ రియల్ స్టోరీ

 

Story 8:



ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ మీరు ఇంతకుముందు వినే ఉంటాం .బ్లడీ మేరీ ఈ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో  భయం  మొదలవుతుంది. మీరు కూడా బ్లడీ మేరీ పేరు ఇంతకుముందు వినే ఉంటారు. ఇప్పుడు స్టోరీ లోకి  వెళ్దాం......


     ఎవరైనా సరే  దెయ్యాన్ని చూడాలంటే  ఇంట్లో ఉన్న లైట్లు అన్ని ఆపి  ,కొవ్వొత్తి వెలిగించి ,అద్దం ముందుకు వెళ్లి  బ్లడీ మేరీ....బ్లడీ మేరీ.....బ్లడీ మేరీ..... అని మూడుసార్లు అనగానే  మీకు అద్ధంలో.........


       అతి భయంకరమైన రూపం కనిపిస్తుంది. ఆమె కళ్ళు రక్తాన్ని కారుస్తాయి. ఆమె పళ్ళు  మీ గోంతును  కొరుకుతాయి. మీ కంటిలోని గుడ్లలను  బ్లడీ మేరీ పిక్కు పోతుంది. మీకు దారుణమైన  చావుని చూపిస్తోంది. ప్రపంచంలో చాలామంది ఈ విషయాన్ని చాలా బాగా నమ్ముతారు. చాలా మంది జీవితంలో బ్లడీ మేరీని స్వయంగా చూశామని చెప్పే వాళ్ళు ఉన్నారు .చాలామంది ఆ బ్లడీ మేరీ చేతిలో చనిపోయిన వారు ఉన్నారు .కనుగుడ్లు వేరు చేయబడ్డాయి. వాళ్ళ గొంతు కొరికి రక్తం తాగబడింది. ఇప్పుడు బ్లడీ మేరీ  రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం.....


           చాలా రోజుల క్రితం మేరి అనే అమ్మాయి ఉండేది.ఆమె  అంత అందంగా ఉండేది కాదు. ఎప్పుడు అద్ధం లో చూసుకొని చాలా బాధపడేది .అయితే ఒకరోజు వాళ్ళమ్మ తన కోసం కొత్త  బట్టలు తీసుకుని వచ్చింది. ఆ బట్టలు వేసుకుని మేరీ చాలా అందంగా ఉన్నానని భావించేది. ఎప్పుడు ఆ బట్టలు వేసుకుని అద్ధం ముందు కూర్చుని చూసుకుంటూ వుండేది .ఒకరోజు ఉన్నట్టుండి  మేరి ఇల్లు మంటల్లో కాలిపోయింది. కానీ మేరీ  మాత్రం అద్దం ముందు కూర్చుని తనను చూసుకుంటూ  సజీవ దహనం అయింది. అప్పటి నుండి అద్ధం ముందు ఎవరు ఆమె పేరు తలచుకున్నా  వారిని చంపడం మొదలు పెట్టింది. 

     

          బ్లడీ మేరీ  గురించి ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అది ఏమిటంటే బ్లడీ మేరీ ఒక మంత్రగత్తె .ఆమె అందంగా తయారవడం కోసం ఆడవాళ్లను చంపి   వాళ్ల రక్తంతో స్నానం చేసేది. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి బ్లడీ మేరీని  అందరూ కలిసి కాల్చి చంపేశారు.అందువల్ల   ఎవరు తనను తలచుకున్నా సరే వాళ్లను చంపడం మొదలు పెట్టింది.


           ఇప్పటివరకు బ్లడీ మేరీ చేతిలో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎవరైతే తనను నమ్మి తలచుకుంటారో  వారిని చంపడానికి తను తప్పకుండా  వస్తుంది.




            ఈ స్టోరీ ప్రపంచంలో చాలామంది విన్నది,అలాగే అనుభవించిన రియల్ స్టోరీ....

      మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి .నేను దాని పై స్టోరీ   రాస్తాను.



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు