Story 7:
ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ జర్మనీలో 1970లో జరిగింది. డేవిడ్ మిచ్చల్ అనే ఒక అమ్మాయి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన. ఆ విషయం ఎప్పుడు ఎవరు తలచుకున్న చాలా భయం కలిగించే ఒక పీడ కల లాంటిది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం......
మిచ్చల్ చిన్నప్పటి నుండి జీసస్ అంటే ఎంతో భక్తి. చిన్నప్పట్నుండి ప్రతిరోజు చర్చి కి వెళుతూ ఉండేది. అయితే ఒకరోజు మిచ్చల్ తల్లిదండ్రులు ఒక ఇంటిని తీసుకున్నారు. అదే మిచ్చల్ జీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఎంతో సంతోషంగా ఉండే మిచ్చల్ దెయ్యాలతో చిత్రవాది అనుభవించింది. అయితే ఆ ఇంటిని తీసుకున్న తర్వాత మిచ్చల్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.....
మిచ్చల్ ఆ రోజు నుండి చర్చికి వెళ్లేది కాదు. ఒకవేళ తల్లిదండ్రుల బలవంతం వల్ల వెళ్లినా గాని అక్కడ ఎక్కువ సేపు ఉండగలిగేది కాదు. ఎప్పుడైనా తన స్నేహితురాలితో కలిసి చర్చి కి వెళ్ళినప్పుడు అందరూ ప్రార్ధన చేస్తున్న సమయంలో తన కాళ్ళ కింద మంటలు పుట్టినట్టుగా కాలిపోతుంది, అని తన స్నేహితురాలికి చెప్పింది .చర్చిలో ఇచ్చే పవిత్ర జలాన్ని కూడా తాగ లేకపోయేది. ఎంతో పవిత్రమైన సిలువను చూడ లేకపోయేది ,తాకను కూడా తాకలేకపోయింది.మిచ్చల్ ప్రవర్తనలో ఈ మార్పు చూసిన ఆమె తల్లిదండ్రులు ఎంతో భయపడ్డారు.మిచ్చల్ ను భూతాలు వదిలించే చర్చి ఫాదర్ దగ్గరకు తీసుకెళ్దాం అనుకున్నారు. కాని జర్మనీలో ఇలాంటి వాటికి అక్కడికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు.
అయితే కొద్ది రోజుల తర్వాత మిచ్చల్ ఇంకా వింతగా ప్రవర్తించేది. రాత్రులు పెద్ధగా శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉండేది. అయితే చర్చి ఫాదర్ లు గవర్నమెంట్ పర్మిషన్ కోసం మిచ్చల్ వాళ్ళ ఇంట్లో కెమెరాలను పెట్టారు. ఆ కెమెరాలు మిచ్చల్ యొక్క భయంకరమైన ప్రవర్తనను రికార్డ్ చేశాయి.
తను ఉన్నట్టుండి ఒక్కసారిగా గాల్లోకి లేచి, గట్టిగా అరుస్తూ తననీ తానే గాయం చేసుకునేది. ఈ ఆధారాలను మిచ్చల్ తల్లిదండ్రులు కోర్టుకు సమర్పించారు .అప్పుడు కోర్టు వారికి అనుమతి ఇచ్చింది.
మిచ్చల్ ను నయం చేయడానికి వచ్చిన చర్చి ఫాదర్లు మిచ్చల్ యొక్క గొంతు నుండి ఆరు వేరు వేరు శబ్దాలు రావడం గమనించారు. అప్పుడే వాళ్లకు ఒక భయంకరమైన సంఘటన తెలిసింది
మిచ్చల్ శరీరంలో ఆరు ఆత్మలు ఉన్నట్టుగా వారికి అర్థమైంది అది చూసి వాళ్ళు చాలా భయపడ్డారు.అలాగే చాలా బాధ పడ్డారు. ఎందుకంటే మిచ్చల్ ను ఆరు ఆత్మలు వేందించుకు తింటున్నాయి. ఆ చర్చి ఫాధర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని వారు ఆ ఆత్మను వదిలించలేకపోయారు. చివరకు కొన్ని రోజుల తర్వాత మిచ్చల్ మరణించింది.మిచ్చల్ మరి ఇచ్చినప్పటికీ ఆమె బరువు కేవలం 30 కేజీలు. ఆమె ఒళ్ళంతా తీవ్రమైన గాయాలతో బాధించ బడింది.
ఈ సంఘటన జరిగిన తర్వాత చర్చి ఫాదర్లే ఆమెను బాధించారు అని కోర్టులో కేసు వేయబడింది. అయితే మిచ్చల్ గొంతు నుండి వినబడిన ఆరు రకాల శబ్దాలు, వీడియోను కోర్టు ముందుకు ఉంచారు. అప్పుడు కోర్టు వాళ్ళ విడుదల చేసింది
మిచ్చల్ రియల్ వీడియో::::
మిచ్చల్ తల్లిదండ్రులు కొన్ని రోజులకు మళ్లీ కోర్టుకు వెళ్లి తమ కూతుర్ని నాసిరకం శవపేటికలో పాతి పెట్టమని, కొత్త శవపేటికలో భద్ర పరుస్తామని చెప్పారు. మొత్తానికి కోర్టు అంగీకరించింది. కాని వాళ్ళు తవ్వి చూసేసరికి మిచ్చల్ శవం కనపడలేదు.
మిచ్చల్ శవం ఏమైంది? కొన్ని రోజులకు మిచ్చల్ నివశించే ఇళ్ళు కూడా ఉన్నట్టుండి మంటల్లో కాలిపోయింది. ఆ మంటలు ఎలా అంటున్నాయె ఎవరికీ తెలియదు.
ఇలా మిచ్చల్ కథ చాలా విషాదంలో ముగిసింది.
మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి .నేను దాని పై స్టోరీ రాస్తాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి