ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
Ghost experience by college students- కాలేజ్ స్టూడెంట్స్ గోస్ట్ ఎక్స్పీరియన్స్
Story 5:
ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ మన దేశంలోనే కేరళ జరిగింది. ఒక యదార్థ సంఘటన ఈ కథలో ఆత్మను చూసినవారు కాలేజీ స్టూడెంట్స్ .వాళ్ళ నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఒకరిద్దరు తాము దెయ్యాన్ని చూశారంటే మనం నమ్మక పోవచ్చు .కానీ ఈ కథలో ఒక బస్సులో ఉన్న స్టూడెంట్స అందరు కూడా దెయ్యాన్ని చూశారు. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం......
కేరళలో ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు వాళ్ళ స్టడీస్లో భాగంగా ఎడ్యుకేషనల్ ట్రిప్ కి వెళ్ళారు. వాళ్ళందరూ నాలుగు బస్సులో బయలుదేరారు. ఇండస్ట్రీ విజిట్ లేట్ కావడంతో బస్సులు కొంచెం లేటుగా నాలుగు గంటలకు బయలు దేరాయి .అయితే వాళ్లు వాళ్ల కాలేజీకి వెళ్ళడానికి ఒక అడవిని దాటి వెళ్లాలి.
అయితే ముందు మూడు బస్సులు వెళ్లిపోయాయి.నాలుగో బస్సుకు టైర్ పంచర్ కావడంతో ఆ బస్సు ఆగిపోవాల్సి వచ్చింది. వెంటనే డ్రైవర్ బస్సులో ఉన్న కొత్త టైర్లు మార్చారు. కానీ అప్పటికే సమయం ఏడు గంటలు దాటింది. విద్యార్థులందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు . కేకలు వేస్తూ, అల్లరి చేస్తున్నారు .అయితే వాళ్ళ సంతోషం ఎంత సమయం నిలువ లేదు. ఎవరు ఊహించని అటువంటి ఒక భయంకరమైన సంఘటన జరిగింది.....
బస్సు వెనుక కూర్చున్న వాళ్లందరికీ ఒక భయంకరమైన సంఘటన కనబడింది. ఒక ముసలి అతను బస్సు వెనకాల చేతిలో లాంతరు పట్టుకుని గట్టిగా అరుస్తూ వెంబడించాడు.
అతని జుట్టు చాలా తెల్లగా, పొడుగ్గా ఉంది ముఖం అంతా వికృతంగా ఉంది. సగం ఒంగొని చేతిలో లాంతరు పట్టుకొని బస్సు ఎంత వేగంగా వెళుతుందో అంతే వేగంగా బస్సు వెనకాతల పరిగెట్టాడు .అప్పటి వరకు సంతోషంగా ఉన్న స్టూడెంట్ అందరూ ఒక్కసారిగా భయాందోళనలు చెందారు .వాళ్ళ సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది.అందరూ ముఖంలో విచారం కమ్ముకుంది.
ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు మొదలైంది ఆ వికృత రూపం వస్తోంది. అతని కేకలు వినగానే అందరూ భయంతో అరుస్తున్నారు. బస్సు అడవిని దాటి నంత వరకు వికృతరూపం వెనకాతల వచ్చింది .అడవిని దాటగానే ఆ రూపం మాయమైపోయింది. ఆ రోజు రాత్రి అందరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలేజీకి చేరారు.
వారి జీవితం లో ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేరు. తర్వాత రోజు చుట్టుపక్కల గ్రామాల వారి నుండి అసలు విషయం తెలుసుకున్నారు. ఆ ముసలి ఆత్మ రాత్రి వేళల్లో అడవి నుండి వెళ్లి బస్సులను లారీలను ఆపుతుంటుంది అని చెప్పారు. మా ఊరిలో చాలామంది ఆత్మను తాము చూశామని చెప్పారు....
ఇది ఆ స్టూడెంట్స్ జీవితంలో ఒక యదార్థమైన వళ్ళు గగుర్పొడిచే సంఘటనగా మిగిలిపోయింది...
మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి .నేను దాని పై స్టోరీ రాస్తాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి