ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
Ghost house-దెయ్యాల భవనం
Story 4:
ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టడీ మన దేశంలో జరిగింది కాదు .ఈ స్టోరీ వేరే దేశం లో జరిగింది .నాకు ఆ దేశం పేరు సరిగా గుర్తు లేదు .ఇది నేను ఒక న్యూస్ ఆర్టికల్లో చదివాను. అయితే ఇప్పుడు నేను మీకు ఆ స్టోరీ చెప్పబోతున్నాను.....
ఒక కుటుంబం చాలా సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఇంటిని తీసుకున్నారు. అయితే ఆ ఫ్యామిలీలో భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి ఇంకో అబ్బాయి .అయితే ఇల్లంతా చాలా అందంగా ఉండేది ,కానీ వంట గదిలో మాత్రం నేలపై ఏవేవో వికృతమైన బొమ్మలు ఉండేవి .వాటిని ఎంత తుడిచిన సరే పోయేవి కాదు .ఎప్పుడు రాత్రి వంటింట్లో నుండి ఏవేవో శబ్దాలు వచ్చేవి. ఎప్పుడు వంటింట్లో సామాన్లు అన్ని పడిపోయేవి .అలా ఎందుకు జరుగుతుందో వీళ్ళకు అర్థమయ్యేది కాదు.
అయితే ఆ ఇంటిలో ఉండే వాళ్ల కూతురు లో కూడా ఏదో మార్పు వచ్చినట్టుగా గమనించారు. ఆ అమ్మాయి ఇప్పుడు రాత్రి లో గట్టిగా అరిచేది. చాలా వింత ప్రవర్తించేది. అప్పుడు వాళ్ళు దీనంతటికీ కారణం వికృత ఆకారాల వల్లే అని అనుకున్నారు.
వెంటనే వాళ్ళు వంటిట్లో ఫ్లోరింగ్ చేయించారు. అయితే రెండు రోజులకు మళ్లీ ఆ వికృత రూపాలు కనిపించాయి. దీంతో వారు చాలా భయపడ్డారు వెంటనే దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకున్నారు .వంటగది యొక్క నేలను తవవ్వించారు. అప్పుడే వాళ్ళు ఒక భయంకరమైన సంఘటనలు చూశారు....
ఆ నేలలో వాళ్లకు ఎముకలు పుర్రెలు లాంటి భయంకరమైన వస్తువులు చూసి భయపడ్డాయి.
అప్పుడు ఆ స్థలం గురించి ఎంక్వయిరీ చేస్తే అది ఇంతకు ముందు స్మశానం అని వాళ్ళకి తెలిసింది .అందుకే వాళ్ళ ఇంట్లో ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయని వాళ్ళకి అర్థం అయింది .
వెంటనే వాళ్ళు ఆ ఇంటిని ఖాళీ చేశారు. అప్పుడు వాళ్ళ కూతురు లో వచ్చిన భయంకరమైన మార్పు కూడా అప్పటినుండి మళ్లీ రాలేదు .వాళ్ళ కూతురు పూర్తిగా మామూలు గా మారిపోయింది .
ఇప్పటికి ఆ ఇళ్ళు అలాగే ఉంది. ఆ వికృత రూపాలు రావడానికి కారణం ఎవరికీ అంతుపట్టలేదు .స్మశానం లో పాతిపెట్టిన మనుషుల ముఖాలే అలా వికృత రూపంలో బయటపడ్డాయని వాళ్ళకి అర్థం అయింది .ఇది ఎప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది....
మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి .నేను దాని పై స్టోరీ రాస్తాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి