Ghost in haveli-హవేలిలో భూతం

 హవేలి అంటే ఆర్కిటెక్చర్ ఉన్న ఇల్లు అన్నమాట. ఇలాంటి పేరుని మనం రాజస్థాన్ లో ఎక్కువగా వింటూ ఉంటాం అక్కడ మనం ఎక్కువ హవేలీలను చూస్తాం.

      ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ రాజస్థాన్ లోని సంఘం అనే విలేజ్ లో జరిగింది .ఇది 1952లో జరిగిన యదార్థ సంఘటన...

 ఆ ఊరిలో ఒక జంట నివసిస్తూ ఉండేది. వారికి ఒక కూతురు ఉండేది ఆమె పేరు హసీనా. హసీనా వాళ్ళ తండ్రి ఆమెకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. అయితే అప్పుడు ఆ హవేలీలో  హసీనా వాళ్ళ తల్లి ఇద్దరు ఉండేవారు .అయితే  హసీనా వాళ్ళ తండ్రి చనిపోయిన నెల రోజుల తర్వాత హసీనావాళ్ళింటికి ఆ వూరి పెద్దాయన  కరుణాకర్ వచ్చారు అప్పుడు ఆ ఇంట్లో హసీనా ఇంకా వాళ్ళ అమ్మ  ఇద్దరే ఉన్నారు .అయితే అప్పుడే కరుణాకర్ హసీనా వాళ్ళ అమ్మ పై బలవంతం చేయబోయాడు.




        అప్పుడు హసీనా కరుణాకర్ని అడ్డుకోబోయింది. అప్పుడు కరుణాకర్ హసీనాను ఒక కుర్చీ కట్టేసాడు. తన నోటిని కూడా కట్టేసాడు. హసీనా కళ్ళముందే తన తల్లి పై బలవంతం చేశాడు .హసీనా అదంతా చూస్తూ ఉండిపోయింది. తను ఎంత అరవాలని ప్రయత్నించినా తన వల్ల కాలేదు .అయితే  కరుణాకర్ తర్వాత ఆ ఇంటికి తాళం వేసి ఆ ఇంటి వైపు ఎవర్ని  వెళ్ళనివ్వలేదు .హసీనా వాళ్ళ అమ్మ చనిపోయింది .హసీనా అది చూస్తూ ఆ పక్కనే ఏడుస్తూ ఉండిపోయింది నాలుగు రోజుల తర్వాత హసీనా వాళ్ళ అమ్మ శవం నుండి దుర్గంధం రావడం మొదలైంది. హసీనా ఆ భయానక సంఘటనని  చూస్తూ ఉండి పోయింది. ఇంకో వారం రోజుల తర్వాత హసీనా ఆకలితో దాహంతో చనిపోయింది. హసీనా చనిపోయిన తర్వాత తను ఒక ప్రశ్నగా మారింది. అంటే ఆత్మ గా మారింది .తన ఆత్మ గా మారిన వెంటనే హసీనా కరుణాకర్ వాళ్ళ ఇంటికి వెళ్లింది .అది రాత్రి సమయం.....

      కరుణాకర్ గాఢనిద్రలో ఉన్నాడు హసీనా అతని గదిలోకి వెళ్లి బిగ్గరగా అరవడం మొదలు పెట్టింది  .ఆ అరుపులకు  కరుణాకర్ నిద్రలేచాడు .హసీనా రూపాన్ని చూసి చాలా భయపడ్డాడు తన భీకరమైన గొంతు అతని గుండె దడను  పెంచింది. అప్పుడు హసీనా అతనికి నరకం చూపించాలి అనుకుంది.


    


 హసీనా అతని కళ్ళలోంచి గుడ్లను వేరు చేసింది  .అతని రెండు చేతుల్ని నరికేసింది .తర్వాత కాళ్ళు కూడా నరికింది .హసీనా వాళ్ళ అమ్మ ఎంత నరకాన్ని అనుభవించిందో అతనికి కూడా అంతే నరకం చూపించింది. అతని రక్తం ఏరులై పారింది. హసీనా గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది.

      తరువాత రోజు  కరుణాకర్  శవాన్ని చూసి ఆ ఊరి వారు చాలా భయపడ్డారు. అలాంటి   భయంకరమైన సంఘటన వాళ్లు ఎప్పుడూ చూడలేదు.


    అయితే ఆ  హవేలీలో  ఇప్పటికీ హసీనా ఏడుపు వినిపిస్తుందని  ఆ చుట్టు పక్కల జనం చెప్తూ ఉంటారు....

     

 నేను ఈ కథని బాధతో ముగించాలని అనుకోవడం లేదు. ఆ పాపని  దెయ్యం  అనడం నాకు ఇష్టం లేదు. ఆమె నా దృష్టిలో ఒక ఏంజెల్ ఆమె తర్వాత స్వర్గంలో  వాళ్ళ అమ్మ ను కలుసుకుని సంతోషంగా ఉంది.


   మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి నేను దాని పై స్టోరీ   రాస్తాను.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు