Story 6:
ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఒక గోస్ట్ స్టోరీ. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్లో 1967లో జరిగింది .ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం......
1967లో వెస్ట్ బెంగాల్ లో ఒక రైల్వే స్టేషన్లో ఒక పాసింజర్ ట్రైన్ వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ ట్రైన్ ఎక్కారు. రైలు స్టేషన్ నుండి బయలుదేరింది. రైల్వే స్టేషన్ను క్రాస్ చేసే ఆ సమయంలో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ట్రైన్ వెనకాతల పరిగెడుతూ ఉంది. అయితే అప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో పనిచేసే ఒక ఉద్యోగి ఆ అమ్మాయిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అప్పుడే ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది....
ఏమైందో తెలియదు గానీ ఆ అమ్మాయి ,ఎవరు తనను ఆపాలని చూశారో వారి లోపలి నుండి దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అలా కొంత దూరం పరిగెడుతూ ఒక్కసారిగా మాయమైపోయింది. అయితే తను చూసిన ఆ దృశ్యాన్ని తనతో పనిచేసే మిగతా వారికి కూడా చెప్పారు. కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు. తను ఆరోజు ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్ళాడు .అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ తర్వాత రోజు ఒక సంఘటన జరిగింది....
ఎవరయితే ఆ అమ్మాయిని చూసారో అతను ఆ మరుసటి రోజు చనిపోయారు . ఆరోగ్యంగా ఉండే అతను ఆ రోజు ఎలా మరణించారు వాళ్ళకి అర్థం కాలేదు...ఇది ఆ భూతమే చేసిందా?
అయితే ఆ మరుసటి రోజు నుండి ఆ ఆత్మ అక్కడ పనిచేసే మిగిలిన ఉద్యోగులకు మరియు ఆ రైల్వే స్టేషన్కు వచ్చె ప్రయాణికులకు కూడా కనబడుతూ ఉండేది . తను ఎప్పుడు ఒక తెల్ల చీర కట్టుకుని ,జుత్తు విరబోసుకుని బిగ్గరగా నవ్వుతూ వచ్చేపోయే రైలు వెనకాల పరిగెడుతూ ఉండేది. తనని చూసి ప్రయాణికులు మరియు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎంతో భయపడేవారు.
అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడ పని చేసేందుకు ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోయింది. ఆ రైల్వే స్టేషన్ని గవర్నమెంట్ 1967లో మూసేసింది. అప్పటి నుంచి అక్కడ రైలు ఆగడం మానేశాయి.
మళ్లీ దాదాపు 40 సంవత్సరాలు తరువాత 2009లో మళ్లీ ఆ రైల్వే స్టేషన్ను తిరిగి తెరిచారు.
కానీ అక్కడ పని చేయడానికి ఉద్యోగులు ఇష్టపడలేదు.దాంతో గవర్నమెంట్ ఆ స్టేషన్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసింది. వాళ్లు కూడా ఆ భూతాన్ని చూడటంతో వారు కూడా రాత్రి 6 గంటల తర్వాత అక్కడ ఉండడం మానేశారు.
ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎప్పుడూ ఆ భూతాన్ని చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు....
మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి .నేను దాని పై స్టోరీ రాస్తాను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి