Ghost in a well-బావిలో భూతం

 Story 3:

            ఇప్పుడు నేను మీతో చెప్పబోయే స్టోరీ మా ఫ్రెండ్ వాడీ జీవితంలో  జరిగిన ఒక రియల్ స్టోరీ .ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరం దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అందులో మా ఫ్రెండ్ చెప్పిన రియల్ స్టోరీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు స్టోరీ లోకి వెళ్దాం...


        మా ఫ్రెండ్ విలేజ్ పేరు రామ్ నగరం. అయితే  ఆ విలేజ్ లో శ్వేతా అనే ఒక అమ్మాయి ఉండేది .ఆ అమ్మాయి రవి అనే ఒక అబ్బాయిని ప్రేమించింది .

ఇద్దరు ఒక సంవత్సరం పైనే ప్రేమించుకున్నారు .పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు .

           కానీ రవి వాళ్ళ నాన్న రవి కి ఒక పెళ్లి సంబంధం చూసాడు. రవి ని వెళ్లి ఆ అమ్మాయిని చూడమన్నాను. ఆ అమ్మాయి పేరు రేవతి. అయితే రేవతి చాలా అందంగా ఉంటుంది. రేవతి వాళ్ళ నాన్న కట్నo కూడా బాగా ఇస్తానన్నాడు. దాంతో రవి రేవతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు .


        ఆ తర్వాతి రోజు రవి శ్వేత దగ్గరకు వచ్చి తనకు వాళ్ళ నాన్న చూసిన  సంబంధం ఇష్టం లేదని చెప్పాడు.కానీ ఇంట్లో బలవంతం చేస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు శ్వేత రవి కి తెలియకుండా రేవతి ని కలిసింది. రేవతి తో రవికి తనకు ఉన్న సంబంధం గురించి చెప్పింది .తనకు ఎలాగైనా  సాయం చేయమని కోరింది .దానికి రేవతి అలాగే అని  చెప్పింది .రేవతి వాళ్ళ నాన్న తో తనకి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పింది .వెంటనే రేవతి వాళ్ళ నాన్న ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేశాడు. ఈ విషయం రవికి తెలిసింది...

    రవి  ఎలాగైనా తనని ఆడ్డు తప్పించాలని చూశాడు.అయితే శ్వేత కి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఊరి చివర ఉన్న ఒక గుడి కి రమ్మన్నాడు శ్వేత అతని మాటలు విని అక్కడకు వెళింది.అప్పుడు రవి శ్వేత ను చంపి పక్కనే ఉన్న ఒక బావిలో పడేసాడు. అలా శ్వేతను తన దారి నుండి అడ్డు తప్పించాడు.... కానీ ఎవరూ ఊహించని విధంగా  ఒక భయంకరమైన సంఘటన జరిగింది....


   శ్వేత  చనిపోయిన  రెండు రోజులకు రవి పిచ్చి పట్టిన  వాడిన తయారయ్యాడు. ఎప్పుడూ తనకు శ్వేత కనిపిస్తుందని .తనను భయపెడుతుందని .తన దగ్గరకు వచ్చే మని భయపెడుతుందని వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పాడు. శ్వేత ఒక యొక్క భయంకర రూపం ఎప్పుడూ తన ముందు కనిపిస్తూతుండేది...

   రెండు రోజులు తర్వాత రవి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేనపుడు,రవి ఏ బావిలో అయితే శ్వేతను చంపి పడేశాడో అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆ ఊరి వారందరూ భయాందోళనలకు గురయ్యారు. అందరికీ అది చాలా వింతగా అనిపించింది...


 దెయ్యాలు లేవు అనేవారు  ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తారా?

   ఒకవేళ పిచ్చి పట్టి బావిలో దూకేసాడు అనుకుంటే మరి శ్వేత చనిపోయిన  అదే బావి ఎందుకు దూకేసాడు?


శ్వేత చనిపోయిన రెండు రోజులకి రవి ఎందుకు పిచ్చివాడిలా మారాడు?


మీ జీవితంలో లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కామెంట్ చేయండి .నేను దాని పై స్టోరీ   రాస్తాను.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు